జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇలా మాట్లాడటం ఏంటి అనసూయ?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన అనసూయ ప్రస్తుతం ఇతర చానల్లో కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండి తెర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తాజాగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలిపారు.

ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాల నుంచి తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తాను ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అదే విధంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని అందుకే ఈ కార్యక్రమం నుంచి రావడం కోసమే తాను ప్రయత్నించానని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా తాను ఎన్నో ఇబ్బందులు పడటమే కాకుండా బాడీ షేమింగ్ గురించి కూడా తనను కామెంట్ చేశారని అయితే ఇవి నచ్చక తాను ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని వాటిని మాత్రం ప్రేక్షకుల వరకు చేరవేయలేదంటూ వెల్లడించారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తాను ఇబ్బందులు ఎదుర్కోవటం వల్లే బయటకు వచ్చాను అని తెలిపారు.

"""/"/ ఈ విధంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పేరు సంపాదించుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమం వల్ల ఇబ్బందులు పడటం వల్ల బయటకు వచ్చానని చెప్పడంపై నేటిజన్ లు స్పందించారు.

ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమం పై బురద చల్లడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇలా ఆ కార్యక్రమం వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే అప్పుడే బయటకు రావాలి కానీ ఇలా కొన్ని సంవత్సరాలు పాటు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగి ఇప్పుడు ఇబ్బందులు పడటం వల్లే బయటకు వచ్చానని చెప్పడం ఏంటి అంటూ కొందరు పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే..: మోదీ