ఇకపై అలాంటి పాత్రలు చేయను.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ( Anasuya ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇక ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా ఈమె ప్రధాన పాత్రలో కూడా మరికొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక త్వరలోనే సింబా( Simba ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. """/" / ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనసూయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు ఈమె తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ అనసూయని ప్రశ్నిస్తే ఇటీవల కాలంలో మీరు ఎక్కువగా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది కారణం ఏంటని  ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ నేను ఒక పాత్రలో ఒక సినిమాలో చేసి ఆ సినిమా సక్సెస్ అవుతూ ఉంటే అదే తరహా పాత్రలలో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

అందుకే రిజెక్ట్ చేస్తున్నానని తెలిపారు. """/" / ఉదాహరణకు క్షణం సినిమాలో నాకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అవకాశం వచ్చి నటించాను.

తదుపరి అలాంటి పాత్రలే వస్తున్నాయి.రంగస్థలం సినిమా( Rangasthalam )లో రంగమ్మత్త పాత్ర సక్సెస్ అయింది తదుపరి అలాంటి పాత్రలే వస్తున్నాయి అందుకే తాను రిజెక్ట్ చేస్తున్నానని తెలిపారు.

  ఇకపై ఇలాంటి పాత్రలు చేయనని తెలిపారు.తాను ఇలా సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదు.

నేను గ్లామర్ ని ఎక్కువగా ప్రదర్శించాలని అనుకుంటున్నా.అందులో తప్పు లేదు.

నేను గ్లామర్ మైంటైన్ చేసినన్ని రోజులు అలాంటి పాత్రలు వస్తే చేస్తా.ఈ విషయంలో నాకు మొహమాటం లేదని తెలిపారు.

ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా కచ్చితంగా డిమాండ్ చేస్తానంటూ అనసూయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వావ్.. డాల్ఫిన్‌ కు తెగ నచ్చేసిన చిన్నారి.. వీడియో వైరల్..