ఆ పని ఎందుకు చేశానంటూ పశ్చాత్తాపపడిన అనసూయ.. ఏం జరిగిందంటే?

బుల్లితెర స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ( Anasuya ) క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

పుష్ప2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో అనసూయ నటిస్తున్నారు.అనసూయ సినిమాలకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉండగా సక్సెస్ రేట్ కూడా ఒకింత ఎక్కువగానే ఉంది.

"""/" / సోషల్ మీడియాలో కొన్నిరోజుల క్రితం విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అభిమానులను రెచ్చగొట్టే విధంగా అనసూయ పోస్ట్ లు పెట్టగా ఆ పోస్టులపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడూ సంతోషంగా ఉండే అనసూయ తాజాగా పశ్చాత్తాపపడుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తాజాగా వెకేషన్ కు వెళ్లిన అనసూయ తన పెద్ద కొడుకు పుట్టినరోజు కావడంతో నచ్చిన ఆహారాన్ని తిన్నారట.

జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ డిషెస్ తినకుండా ఉండాల్సిందని ఎక్కువగా ఆహారం తీసుకోవడంతో కొవ్వును కరిగించాల్సి వస్తుందని ఆ విషయంలో ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు.

అనసూయ విమానం అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా అయినా అనసూయ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

"""/" / అనసూయకు చిన్న సినిమాల కంటే పెద్ద సినిమాలే ఎక్కువగా మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి.

కథ, కథనం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే అనసూయ సక్సెస్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది.

వివాదాలు, విమర్శలకు దూరంగా ఉంటే అనసూయ కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.

అనసూయ బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండగా రీఎంట్రీ విషయంలో ఆమె నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

రాబోయే రోజుల్లో యాంకర్ అనసూయకు సంచలన విజయాలు దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించిన యంగ్ సెలబ్రిటీలందరూ సక్సెస్.. ఆ ఒక్కరు తప్ప..??