Anasuya: పిల్లలతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన అనసూయ.. జీవితంలో భాగమంటూ?

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఈమె కెరియర్ మొదట్లో పలు న్యూస్ చానల్స్ లో పనిచేశారు.అనంతరం ఇతర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరించారు కానీ తనకు మాత్రం జబర్దస్త్ కార్యక్రమం ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

ఇలా జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు మెల్లిమెల్లిగా సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి.

అయితే వెండి తెరపై కూడా తన నటనతో అనసూయ మెప్పించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

దీంతో వెండితెరపై బుల్లితెరపై ఈమె మేనేజ్ చేయలేక బుల్లితెరకు స్వస్తి పలికారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ వెండి తెరపేక్షకులను సందడి చేస్తున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

"""/" / సోషల్ మీడియా వేదికగా తరచూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ పిల్లలకు( Anasuya Family ) సంబంధించిన విషయాలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటారు.

ఇక షూటింగ్ పరంగా అనసూయకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన భర్త పిల్లలతో కలిసి ఈమె వెకేషన్ కి వెళ్తారు.

అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా చిన్నప్పటి నుంచి తన పిల్లలతో కలిసి దిగినటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

"""/" / ఇలా తన ఇద్దరు పిల్లలతో( Anasuya Two Kids ) కలిసి దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ జీవితంలో పిల్లలతో గడపడం అనేది ఎంతో ఉత్తమమైన భాగం అంటూ ఈ సందర్భంగా ఈమె తన పిల్లలతో కలిసి ఉన్నటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక అనసూయకు ఇద్దరు కూడా అబ్బాయిలే అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈ ఫోటోలపై చాలామంది కామెంట్ చేస్తే మీకు ఒక కూతురు ఉంటే చాలా బాగుండేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

"""/" / ఇక అనసూయకు కూడా కూతురు అంటే చాలా ఇష్టం తనకు కూతురు లేరని లోటు అలాగే ఉండిపోయింది అంటూ ఈమె పలు సందర్భాలలో తనకు కూతురు లేరు అనే విషయాన్ని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఈమె కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?