Anchor Anasuya : బయట ఉండి కూడా ఉద్ధరించొచ్చని చెబుతున్న అనసూయ.. పొలిటికల్ ఎంట్రీపై అలా స్పందిస్తూ?

అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనంతరం సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు.

వెండి తెర సినిమా అవకాశాలు రావడంతో ఈమె క్రమక్రమంగా బుల్లితెరకు కూడా దూరమయ్యారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి అనసూయ త్వరలోనే ప్రేమ విమానం ( Prema Vimanam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆ తర్వాత అనసూయ రజాకార్ సినిమా( Razakar )లో కూడా నటిస్తున్నారు.నిజాం కాలంలో రజాకార్ల ఆగడాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమా రూపొందించారు.

"""/" / ఇక ఈ సినిమా నుంచి తాజాగా భారతీ భారతీ ఉయ్యాలో( Bharathi Bharathi Uyyalo ) అనే పాటను విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ పాట విడుదల కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు అనసూయ సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ ( Political Entry ) గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

అనసూయ రాజకీయాలలోకి రాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వార్తలపై తాజాగా ఈమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. """/" / ఈ సందర్భంగా అనసూయ( Anchor Anasuya ) మాట్లాడుతూ.

రాజకీయాలలోకి వస్తున్నానని వార్తలు వస్తున్నాయి కానీ నాకు రాజకీయాలలోకి రావాలి అని ఏమాత్రం ఆసక్తి లేదు అంటూ ఈమె సమాధానం చెప్పారు.

రాజకీయాలకు సంబంధించి ఎవరితోనూ తాను చర్చలు కూడా జరపలేదని ఈమె తెలిపారు.రాజకీయాలు అంటేనే తనకు ఏమాత్రం ఇంటరెస్ట్ లేదని తాను రాజకీయాలలోకి( Anchor Anasuya Political Entry )) రానని తేల్చి చెప్పారు.

ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాలలోకి రావాలని ఏమీ లేదు బయట నుంచి కూడా మనం ప్రజలను ఉద్ధరించవచ్చు.

సంపాదించిన దానిలో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తే చాలని, ప్రస్తుతం తాను అదే పనిలో ఉన్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

అయితే అనసూయ ఇండస్ట్రీలోనే కొనసాగుతారని రాజకీయాలలోకి రారని స్పష్టంగా అర్థం అవుతుంది.

వైరల్: అలా కునుకు తీసింది.. ఇలా గోల్డ్ మెడల్ కొట్టింది..