అప్పట్లో ఈ యాంకర్ అర్థ రూపాయి కోసం రెండు కిలోమీటర్లు నడిచేదట…
TeluguStop.com
తెలుగులో టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి "బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈమె ఒక పక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.
తాజాగా యాంకర్ అనసూయ టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "అలీతో సరదాగా" అనే కార్యక్రమంలో పాల్గొంది.
ఇటీవలే ఈ షో నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు అయితే ఈ ప్రోమో లో అనసూయ భరద్వాజ్ అప్పట్లో 50 పైసలు మిగల్చడం కోసం దాదాపుగా రెండు బస్టాప్లులు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే దానిని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.
అంతేగాక తాము ముగ్గురు అక్కాచెల్లెళ్లని దాంతో తన తండ్రి కొంతమేర స్ట్రిక్ట్ గా పెంచాడని తెలిపింది.
అంతేగాక తాను సినిమా పరిశ్రమకు రాకముందు హెచ్ఆర్ గా పని చేశానని ఆ సమయంలో తనకు ఆర్య-2 చిత్రంలో నటించే అవకాశం దక్కిందని కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రంలో నటించిన లేక పోయానని చెప్పుకొచ్చింది.
అయితే ఈమె గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
అంతేగాక టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న "ఫైటర్" అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?