అలాంటివి పట్టించుకోరు కానీ మాపై పడి ఏడుస్తారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ ( Anasuya Bharadwaj )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.మొన్నటి వరకు యాంకర్ గా అలరించిన ఈమె ప్రస్తుతం నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.
ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది అనసూయ.
ఇకపోతే తాజాగా ఈమె మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. """/" /
అసలేం జరిగిందంటే.
తాజాగా ఒక టీవీలో మెరిసింది ఎన్నటి అనసూయ.ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఒక నెటిజన్ ఏంటి నాన్సెన్స్ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు.
అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది.అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది.
కాగా టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్ షర్ట్ విప్పుతూ కనిపించారు.దీనిపై నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.
ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ.నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.
"""/" /
ఎలా ఉండే షో ఎలా అవుతుందో.అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి.
కానీ బ్యాడ్ వైపు వెళ్తుంది.ఒక నటిగా మీరంటే ఇష్టమే.
ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది అని కామెంట్ చేశాడు.దీనిపై కూడా అనసూయ స్పందించింది.
ఆ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ.సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది.
అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.పెద్దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్‌బస్టర్ చేస్తారు.
అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్ ఇస్తారు.ఇది కేవలం ప్రోమో.
స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది.అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్‌కే పరిమితం.
కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే.నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.