అర్ధరాత్రి నుంచి నాన్ స్టాప్ గా అదేపనే… అలసిపోయారంటూ అనసూయ పోస్ట్!
TeluguStop.com
యాంకర్ గా బుల్లితెర పై పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ గ్లామరస్ యాంకర్ గా పేరు సంపాదించుకున్నటువంటి అనసూయ(Anasuya) సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.
ఈ విధంగా ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేసారు.
ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై మాత్రం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోని ఈమె తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీ అయ్యారని తెలుస్తోంది.
"""/" /
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తన న్యూ ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలియజేశారు.
ఇలా ఈమె షూటింగ్లో పాల్గొని చాలా అలసిపోయి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ అర్థరాత్రి మొదలైన షూటింగ్ నాన్ స్టాప్ గా తెల్లవారుజామున వరకు కొనసాగిందని, ఈ షూటింగ్లో పాల్గొంటూ చాలా అలసిపోయాను అంటూ ఈమె సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. """/" /
ఇక ఈమె ఏ సినిమా షూటింగ్లో పాల్గొన్నారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.
ఇప్పటికే అరడజనకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా విమానం(Vimaanam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈమె పుష్ప 2 సినిమా(Pushpa 2 Movie) షూటింగ్లో కూడా నటించబోతున్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్లోకి అనసూయ అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం ఏకంగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారని చెప్పాలి.
ఇప్పటికీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!