జిమ్ లో భారీగా కష్టపడుతున్న అనసూయ.. ఇప్పుడు అవసరమా ఆంటీ అంటున్న నేటిజన్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో సక్సెస్ అయినటువంటి అనసూయ( Anasuya ) వెండితెర నటిగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనసూయ ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ ఫిట్నెస్ విషయంలో కూడా ఏమాత్రం రాజీపడదు తరచూ పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ జిమ్ లో( Gym ) తెగ కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

"""/" / ఇలా జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ తనని తాను మలుచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈమె జిమ్ లో వర్కౌట్( Work Outs ) చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.

పొట్టి నిక్కర్, టీ షర్ట్ ధరించి భారీ బరువులను మోస్తూ చెమటలు చిందిస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని ఈమె షేర్ చేశారు.

ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి అనసూయ వర్కౌట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా సుదీర్ఘమైనటువంటి పోస్ట్ రాసు కొచ్చారు.

"""/" / ఎప్పుడూ అందంగా ఆకర్షణగా కనిపించడమే కాకుండా మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ విధంగా జిమ్ లో కష్టపడాల్సి వస్తుంది అంటూ అనసూయ ఈ సందర్భంగా వీడియోని షేర్ చేశారు.

ఇక ఈ వీడియో పై నేటిజన్స్ యథావిధిగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో పై కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఆంటీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి జిమ్ అంతా అసలే మీకు వయసు అయిపోయింది కదా ఎక్కడైనా పట్టేస్తే అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు తినటం ఎందుకు ఇలా జిమ్ చేయడం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఇలా చాలామంది ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి అనసూయ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక అనసూయను ఉద్దేశించి ఎవరైనా ఆంటీ అని పిలిస్తే తనకు ఏమాత్రం నచ్చదని ఇది వరకే పలు సందర్భాలలో ఈమె తెలియజేశారు చిన్నపిల్లలు ఆంటీ అంటే పర్లేదు కానీ నాకన్నా పెద్దవారు నా హైట్ ఉన్నవారు కూడా ఆంటీ అని పిలుస్తూ ఉంటారని అలా పిలవడం నాకు ఏమాత్రం నచ్చదు అంటూ గతంలో ఈమె చెప్పినప్పటికీ నెటిజన్స్ ఉద్దేశపూర్వకంగానే తనని ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు.

అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో … వణికిపోతున్నారే ?