సిటీ వీధుల్లో అలా షికారుకు వెళ్లిన అనసూయ?
TeluguStop.com
బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి తెలియని వారెవ్వరు లేరు.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.అటు బుల్లితెర ఇటు వెండితెరపై సమాన క్రేజ్ ను సంపాదించుకుంది.
లేటు వయసులో కూడా తన అందంతో బాగా రెచ్చిపోతుంది.రోజురోజుకు ట్రెండ్ ని ఫాలో అవుతూ గ్లామర్ విందుని వడ్డిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ అంతకుముందే వెండితెరలో నటించింది.
కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేదు.జబర్దస్త్ తో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్త గా మంచి పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుతుంది.అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.
సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.
"""/"/
ఇక తనకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.
ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా బాగా గడుపుతుంది.అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.
నిత్యం ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉండే అనసూయ తాజాగా సిటీ వీధిలో షికారు కొడుతుంది.
"""/"/
తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మోడ్రన్ డ్రెస్ ధరించి మాస్క్ వేసుకొని సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ గా మారింది.ఈ ఫోటోను చూసిన అనసూయ అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా మహా సముద్రం సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి కమల్ హాసన్ కాంబోలో మిస్ అయిన సినిమా ఇదేనా..?