నా రాముడు అంటూ ఫోటోలు షేర్ చేసిన అనసూయ… నువ్వు సీతవు కాదంటూ ట్రోల్స్!
TeluguStop.com
బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అనసూయ(Anasuya) ఒకరు.
ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
"""/" /
సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు అనసూయ చేసే పోస్టులు మాత్రం వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.
ఇలా నేటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.తాజాగా అనసూయ శ్రీరామనవమి (Sri Rama Navami)పండుగను పురస్కరించుకొని ఎంతో అందంగా ముస్తాబయి తన భర్తతో కలిసి ఫోటోలు దిగారు.
చీర కట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిల ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు. """/" /
ఇలా తన భర్తతో శశాంక్(Shashank) తో కలిసి దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నా రాముడు(Ramudu) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
మీ భర్త రాముడు కావచ్చు కానీ మీరు మాత్రం సీత కాదు.మీరు శూర్పణఖ అంటూ అనసూయ పై కామెంట్లు చేస్తున్నారు.
ఇలా ఎంతో చక్కగా రెడీ అయ్యావు కానీ మెడలో తాళి ఎక్కడ కాస్త చూసుకోవాలి కదా అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల పుష్ప 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
తాజాగా నాగబంధం అనే సినిమాలో ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.