సీన్లోకి నేను దిగనంతవరకే.. దిగితే హిస్టరీ రిపీట్ అంటున్న అనసూయ?
TeluguStop.com
అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఒకప్పుడు జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ ( Kirak Boys Khilaadi Ladies ) అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో బుల్లితెర నటీనటులు పాల్గొంటున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ కిలాడి గర్ల్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ కార్యక్రమం నేటితో గ్రాండ్ ఫినాలే పూర్తి కాబోతోంది.
"""/" /
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు.
ఇందులో భాగంగా అనసూయ కిరాక్ బాయ్స్ కి వార్నింగ్ ఇస్తూ బాలయ్య బాబు ( Balayya ) డైలాగ్స్ చెప్పడంతో ఈ ప్రోమో వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ కిరాక్ బాయ్స్ ను ఉద్దేశిస్తూ.చెప్పండి ఆ కిరాక్ బాయ్స్ కి.
సెంటరైనా స్టేట్ అయినా.పొజిషన్ అయినా అపోజిషన్ అయినా.
పవర్ అయినా పొగరైనా.నేను దిగనంత వరకే.
వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలకృష్ణ డైలాగ్స్ చెప్పారు.
"""/" /
ఇలా ఈమె చెప్పిన ఈ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక అనసూయ ప్రస్తుతం సినిమాలలో చేస్తూనే మరోవైపు ఈ బుల్లితెర కార్యక్రమంలో కూడా సందడి చేశారు.
గతంలో తాను బుల్లితెర పైకి తిరిగి వచ్చే ఛాన్స్ లేదని చెప్పిన ఈమె అనూహ్యంగా ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం బుల్లితెర పైన వెండితెర పైన ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?