షార్ట్ టైం మెమొరీ లాస్ తో బాధపడుతున్న అనసూయ… ఏజ్ అవుతోందంటూ కామెంట్స్?
TeluguStop.com
అనసూయ త్వరలోనే సింబా( Simbaa ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కారణంగా నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ( Anasuya ) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనసూయ సోషల్ మీడియా వేదిక అయినా లేదా మీడియా సమావేశంలో ఏం మాట్లాడినా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే అనసూయ తాజాగా తనకు షాట్ టైం మెమోరీ( Short Time Memory ) ఉంది అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ సినిమా వేడుకలో భాగంగా అనసూయకు సంబంధించి ఒక స్పెషల్ ఏవి వేశారు.
ఏవి చూసిన అనంతరం అనసూయ మాట్లాడుతూ నేను నా కెరియర్ లో ఇన్ని సినిమాలు చేశాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు.
అయితే ఈ క్రెడిట్ అంతా కూడా ప్రేక్షకులు అభిమానులదేనని వారు చూపించిన అభిమానం వల్లే నేను ఇన్ని సినిమాలు చేయగలిగానని తెలిపారు.
ఇక సింబా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నా లైఫ్ లో చేసిన పాత్రలలో ఇది కూడా ఎంతో గొప్ప పాత్ర అని తెలిపారు.
"""/" /
ఇక ఈ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి కూడా అనసూయ మాట్లాడారు.
ఇలా ఈ సినిమా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ కొంతమంది టెక్నీషియన్ల పేర్లు నాకు గుర్తు రావడంలేదని నాకు షార్ట్ టైం మెమొరీ ఉంది అంటూ కామెంట్ చేశారు అయితే అంతటితో ఆగకుండా ఈమె తనకు ఏజ్ అయిపోతుందేమో అంటూ కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా తన ఏజ్ గురించి ఎవరు మాట్లాడిన పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతూ ఉంటుంది అనసూయ.
అలాంటిది ఈమె స్వయంగా తనకు ఏజ్ అయిపోతుందేమో అంటూ కామెంట్ చేయడంతో ట్రోలర్స్ కి మంచి స్టఫ్ దొరికిందని చెప్పాలి.
అమిత్ షా పిలుపు : పవన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ