పుష్పలో ద్రాక్షాయినిగా అనసూయ.. ఫస్ట్ లుక్ అప్డేట్..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో స్మాల్ స్క్రీన్ హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలో అమ్మడు రోల్ ఏంటన్నది రివీల్ చేశారు చిత్రయూనిట్.పుష్ప సినిమాలో అనసూయ ద్రాక్షాయిని పాత్రలో కనిపించనుంది.

ఇక ఈ ద్రాక్షాయిని ఫస్ట్ లుక్ ని బుధవారం ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ద్రాక్షాయిని పాత్ర కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.ఆల్రెడీ సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అదరగొట్టింది.

ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ద్రాక్షాయినిగా అలరించనుంది.ఓ పక్క బుల్లితెర మీద తన హాట్ యాంకరింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు మరోపక్క సినిమాల్లో స్పెషల్ సాంగ్స్.

ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ వస్తుంది.పుష్పలో ద్రాక్షాయిని పాత్ర రంగమ్మత్తని మించి ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

అనసూయకి ఇలానే మంచి ఆఫర్లు రావాలని ఆశిద్దాం.ఫీమేల్ లీడ్ గా ఛాన్సులు రావట్లేదు కాని అలా వస్తే హీరోయిన్ గా కూడా నటించాలని ఫిక్స్ అయ్యింది అనసూయ.

 అయితే తను లీడ్ రోల్ గా చేయాలంటే మాత్రం కథలో కచ్చితంగా విషయం ఉండాలని అంటుంది అనసూయ.

ముగ్గు చల్లుతూ ఇంత అందమైన రంగోలి వేయగలరా.. ఈ వీడియో చూస్తే నమ్మలేరు!