Anasuya Bhardwaj : ట్రోలర్స్ కు ఝలక్ ఇచ్చిన అనసూయ.. నెట్టింట్లో మళ్లీ మొదలైన రచ్చ?

అయితే ఇకపై తాను కూడా అటువంటి వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వను అని, తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి బాగా రీచ్ అయితే చాలు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది అనసూయ.

ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ పోలీసులు సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించారు.

మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ స్నేహా మెహ్రా ( Crime DCP Sneha Mehra )ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు.

ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌ చేసినా, ఫోటోలు మార్ఫింగ్‌ చేసినా కఠినమైన శిక్షలుంటాయని పేర్కొన్నారు.

"""/" / వారు పెట్టే పోస్టుల పట్ల తమకు ఫిర్యాదులు అందిస్తే ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇప్పటికే ఇలాంటి కేసులు 20 మందిపై నమోదు కాగా, ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నట్టు వారు తెలిపారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ( Anasuya ) ఈ వార్తని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది.అయితే నెటిజన్లు అనసూయ పై మరోసారి రెచ్చిపోతున్నారు.

తమదైన పోస్టులతో రచ్చ చేస్తున్నారు. """/" / మరోసారి అనసూయని ట్విట్టర్‌ వేదికగా ఆంటీ అంటూ కామెంట్లు పెడుతూ రెచ్చిపోతున్నారు.

కొందరు నెటిజన్లు ఇది మీ పోరాట ఫలితమే అని ఆమెకి కితాభిస్తున్నారు.చాలా మంది మహిళలకు నువ్వే ఆదర్శమంటున్నారు.

కానీ కొందరు నెటిజన్లు ఆంటీలు ఆంటీల లాగా ఉంటే ప్రాబ్లమ్‌ లేదని, అసభ్యకరమైన ఫోటోలు పెడితే ఘాటునే రిప్లై ఇస్తామంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు అసభ్యకరమైన ఫోటోలు పెడితే మీపై కూడా కేసులు పెడతాము అంటూ అనసూయకు రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

ఏది ఏమైనాప్పటికీ సోషల్ మీడియాలో మరోసారి అనసూయ పేరు మారు మోగిపోతోంది.

వైరల్ వీడియో: నీకు హాట్సాఫ్ గురూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నావుగా