విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు… మీడియాపై ఫైర్ అయిన అనసూయ?
TeluguStop.com
యాంకర్ గా బుల్లితెరపై ఎంత మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ( Anansuya ) వెండితెర సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా ఈమె ప్రధాన పాత్రలలో సినిమాలు కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో సింబ( Simba ) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ ట్రైలర్ లో భాగంగా ఒక చిన్న డైలాగ్ విజయ్ దేవరకొండను( Vijay Devarakonda ) ఉద్దేశించి ఉంది.
"""/" /
మీకు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి మొగుడు వస్తాడు మేడం అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్ ఇందులో హైలెట్ అయింది.
అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అనసూయకు రిపోర్టర్ల నుంచి ఈ డైలాగు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమా సమయం నుంచి అనసూయ విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
విజయ్ ఫ్యాన్స్ దెబ్బకి అనసూయ ఒకానొక సమయంలో నేను ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకుంటున్నానని కూడా చెప్పేశారు.
"""/" /
ఇలా ఈ వివాదం గురించి మాట్లాడానని చెప్పిన అనసూయ తిరిగి విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని డైలాగ్ చెప్పడం పట్ల తాజాగా స్పందించారు.
సినిమా ద్వారా ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నానో, అప్పుడు కూడా జనాలకు మెసేజ్ ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను.
మనం ఫోకస్ అవుతున్నప్పుడు పద్ధతిగా ఉండాలి, కానీ మితిమీరితే అది అందరికి తెలుస్తుంది.
నిజానికి ఆ సమయంలో మీకు అది ఎందుకు తప్పు అనిపించలేదో నాకు తెలియదు.
ఇది మీరు అడగాల్సిన ప్రశ్న కానీ ఆ సమయంలో నేను అడగాల్సి వచ్చిందని తెలిపారు.
అది ముమ్మాటికి మీ తప్పే, మళ్లీ మీరే నన్ను ఉల్టా బదనాం చేస్తున్నారు.
దాని మూలంగా నేను ఎవరినీ హేట్ చేయడం లేదు.ఇది సరైన పద్ధతి, గౌరవం కాదు అని మాతమే చెప్పాను.
అంటూ చాలా కూల్ గా విజయ్ దేవరకొండ తో వివాదం గురించి ఈమె మరోసారి క్లారిటీ ఇచ్చారు.
My Jackpot Review And Player Reputation: What Canadian Beginners Should Know