మీరేనా రక్షణ కవచం… అభిమానులపై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు.యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం నటిగా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా వెండితెర పైన బుల్లితెర పైన వరుస కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ త్వరలోనే సింబా (Simbaa) అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ టాపిక్ తీసుకురావడంతో మరోసారి ఈమెపై ట్రోల్స్ మొదలయ్యాయి.

"""/" / ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా ఒక అభిమాని ఈమెను నేరుగా చూశారట.

ఇదే విషయం గురించి ఆ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

తన లైఫ్‌లో అనసూయను రెండో సారి చూశాను.అది చాలు అంటూ ఓ ట్వీట్ వేశాడు.

ఫ్యాన్ వేసిన ట్వీట్‌కు అనసూయ స్పందించింది.అయ్యో మరి నన్ను కలవచ్చు కదా.

అని అనడంతో చాలా ట్రై చేశాను కానీ మీరు చాలా ఓపికగా మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.

ఏది ఏమైనా మిమ్మల్ని చూశాను చాలు అంటూ సమాధానం చెప్పారు. """/" / ఈసారి వస్తే మాత్రం దయచేసి మీరు నన్ను కలవండి ఏం జరిగినా పర్వాలేదు నన్ను కలవమని తెలిపారు.

అనుక్షణం నాతో ఉంటూ నన్ను రక్షిస్తూ నాకు రక్షణ కవచంలా ఉండే మీలాంటి అభిమానులను కలవకపోతే అదృష్టం లేనట్టే అంటూ ఈమె అభిమానులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అనసూయ ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

పవన్ ప్లాన్ : పెద్ద నాయకులు టిడిపిలోకి … చిన్న నాయకులు జనసేనలోకి