రెచ్చగొట్టొద్దు దమ్ముంటే స్టేజ్ మీదకు రా… మాస్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు ఈమె బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పరిచయం అయిన ఈమె అనంతరం  బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.

ఇక ఈమెకు జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయకు అనంతరం సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఈమె రంగస్థలం సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం సినిమాలపరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.

ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు తన ఫ్యామిలీకి కావాల్సిన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అయితే సోషల్ మీడియా వేదికగా అనసూయ వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటారు.ఈమె షేర్ చేసే పోస్టులపై నేటిజన్స్ స్పందనను బట్టి పెద్ద ఎత్తున వారికి తనదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు తద్వారా ఎన్నో వివాదాలలో కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.

"""/" / తాజాగా మరోసారి  ఇలాంటి వివాదంలో అనసూయ నిలిచారు.అనసూయకు ఆంటీ(Aunty) అని పిలిస్తే చాలా కోపం వస్తుందనే సంగతి మనకు తెలిసిందే అయితే హోలీ ( Holi ) పండుగను పురస్కరించుకొని ఈమె హైదరాబాద్లో ఒక వేడుకకు హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో భాగంగా స్టేజ్ మీద అనసూయ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఓ ఆకతాయి కింద నుంచి ఆంటీ( Aunty ) అంటూ గట్టిగా కేకలు వేశారు.

ఈ మాటలు కాస్త అనసూయ చెవిలో పడటంతో స్టేజ్ పైనుంచి వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

"""/" / ఆంటీ అని పిలిచిన వాడు ఎవరో దమ్ముంటే పైకి రా.

నన్ను రెచ్చగొట్టొద్దు.నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపిస్తాను.

ఏంటి, భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్టుగా సైగలు చేశారు.

  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.