Anasuya Pawan Kalyan : పవన్ పిలిస్తే ప్రచారం చేస్తాను.. అనసూయ పొలిటికల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంది.
ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఇక కొన్ని పార్టీలకు కొంత మంది నాయకులు సినీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి అనసూయ మాట్లాడుతూ ఇది వివాదం అవ్వచ్చు కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటూ ఈమె రాజకీయాల( Politics ) గురించి మాట్లాడారు.
నేను తప్పై ఉండొచ్చు.నాకు లీడర్స్‌తోనే పని.
పొలిటికల్ పార్టీలతో కాదు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గొప్ప నాయకుడు.
ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. """/" /
నేను జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో పని చేసేటప్పుడు నాకు నాగబాబు( Nagababu ) గారు రోజా( Roja ) గారు ఇద్దరు కూడా చాలా క్లోజ్ నాగబాబు గారు, ఇటునుంచి రోజా గారు పిలిస్తే నేను పార్టీల పరంగా చూడకుండా నాయకుల పరంగా చూసే వారికి మద్దతు తెలుపుతానని ఈమె తెలిపారు.
నాకు చాలా పార్టీల నుంచి చాలామంది లీడర్లు తెలుసు.వాళ్లని అభిమానిస్తాను.
వాళ్లు ఇద్దరూ పిలుపునిస్తే.ఆ రెండు పార్టీల్లోకి వెళ్తాను.
అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది కానీ అదే నా వృత్తి కాదని ఈమె తెలిపారు.
"""/" /
నేను దేనిని నమ్ముతాను దాన్నిబట్టే సపోర్ట్ చేస్తానని తెలిపారు.నాకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ మా నాన్న రాజకీయాలలో ఉండేవారు నావల్లే మా నాన్న రాజకీయాలు కూడా మానేసారని ఈమె తెలిపారు.
నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు కానీ నేను కూడా ఒక సొసైటీలో ఉన్నాను కాబట్టి ఈ సొసైటీకి ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాను.
ఇక జనసేన( Janasena )నుంచి కూడా ప్రచారం చేయమని పిలుపు వస్తే నేను వెళ్తానని ఈమె తెలిపారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి ఆయన పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?