జబర్దస్త్ షో గుర్తొస్తుందంటూ అనసూయ పోస్ట్.. నెటిజన్స్ ట్రోల్స్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అనసూయ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.
అయితేయాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనసూయ.
కాగా అనసూయ కు వెండితెర పై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు బయటికి రావాలని అనిపించి వచ్చేనని నిర్మొహమాటంగా చెప్పేసిన విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ నేపథ్యంలోని తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చటించింది.సోషల్ మీడియాలో తన అభిమానులు అడిగే తనకు ఓపికగా సమాధానం చెప్పింది.
ఈ క్రమంలోనే ఒక అభిమాని మళ్లీ టీవీ షోలో ఎప్పుడు కనిపిస్తారు అని ప్రశ్నించగా.
టీవీ షోలకి కావాలనే బ్రేక్ తీసుకున్నాను.ఏదైనా మంచి ఎక్సయిటింగ్ షో వచ్చినప్పుడు వస్తాను అని తెలివింది అనసూయ.
ఇంతలోనే మరొక అభిమాని ఇప్పుడు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.
"""/"/
అఫ్ కోర్స్ అవును మిస్ అవుతున్నాను.జీవితంలో, నా హార్ట్ లో జబర్దస్త్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది.
కొన్నిసార్లు మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారో అక్కడ ఉండకపోవచ్చు.లైఫ్ లో రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకతప్పదు అంటూ పాజిటివ్ గా స్పందించింది అనసూయ.
కాగా అనసూయ చేసిన కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
ఉన్నప్పుడు అవకాశాలను వదులుకుంది అంటూ ఆమెపై నిప్పులు చెలరేగుతున్నారు.కాగా ఇప్పటికే అనసూయ వెండితెర పై దాక్షాయిని రంగమ్మత్త లాంటి మంచి మంచి పాత్రలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?