అలాంటి దుస్తులు ధరిస్తే రేప్ చేస్తారా… వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్!
TeluguStop.com
అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు.బుల్లితెర యాంకర్ గారు సక్సెస్ అందుకున్న ఈమె వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనసూయ భరద్వాజ్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.
అలాగే ఫెమినిస్ట్ కూడాను.అమ్మాయిలపై ఆంక్షలను ఆమె సహించరు.
ముఖ్యంగా వస్త్రధారణ ( Dressing ) విషయంలో తన పట్ల ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతుంది.
"""/" /
నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అసలు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకు సౌకర్యం ఉంటుందో అలాంటి వాటిని వేసుకుంటాను అంటూ ఈమె పలు సందర్భాలలో తనపై ట్రోల్ చేసిన వారికి గట్టిగానే సమాధానం చెప్పారు.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ అభిమానులు ఒకరు మోడరన్ దుస్తులు కట్టినా, సాంప్రదాయ దుస్తులు వేసుకున్నా మానభంగాలు ఆగవు.
డ్రెస్సింగ్ లో కాదు, మార్పు రావాల్సింది మీ ఆలోచనా విధానంలో అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్ చేశారు.
"""/" /
ఇక ఇదే పోస్టును అనసూయ కోట్ చేస్తూ.నా చుట్టూ ఉన్న మనుషులు ఇలా ఉంటారు.
వారు ఒకరిని వేధించరు.రెచ్చగొట్టరు.
వేదనకు గురి చేయరు.అని అభిప్రాయపడింది.
మానభంగాలకు యువతుల డ్రెస్సింగ్ కారణం కాదని ఆమె పరోక్షంగా మద్దతు పలికింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్టులో వైరల్ అవుతున్నాయి .
ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఇటీవల రజాకర్( Razakar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ త్వరలోనే పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
DASA స్కీమ్ అంటే ఏమిటీ? .. ప్రవాస భారతీయ విద్యార్ధులకు ఎలా ఉపయోగమంటే?