రౌడీ హీరోను చాలా మిస్ అవుతున్న బ్యూటీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్‌తో పాటు అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.

ఇక అనన్య పాండేతో విజయ్ రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించనున్నాడు పూరి.ఈ సినిమాను మెజారిటీ శాతం ముంబైలో షూట్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

అయిత ఇటీవల షూటింగ్‌లో విజయ్‌తో కలిసి వర్క్ చేస్తున్న అనన్య చాలా క్లోజ్ అయ్యిందట.

కాగా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో విజయ్‌ను అనన్య చాలా మిస్ అవుతుందట.

పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రిలీజ్ చేయనున్నాడు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దుల్కర్ లాంటి వ్యక్తి నా జీవితంలో ఉండడం నా అదృష్టం : మృణాల్ ఠాకూర్