దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం దేవర( Devara Movie ).

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల 27వ తారీఖున విడుదలైన విషయం తెలిసిందే.

బారి అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఇప్పటికే కోట్లలో కలెక్షన్స్ను సాధించిన ఈ సినిమా ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాల్లో తన మాటలతో ప్రేక్షకులను మెప్పించింది. """/" / ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటనపై తాజాగా హీరోయిన్ అనన్య పాండే( Ananya Panday ) స్పందించారు.

అనన్య పాండే నటించిన చిత్రం కంట్రోల్.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె స్పందిస్తూ.కమర్షియల్‌ సినిమాల్లో నటించడం సులభమని ప్రేక్షకులు భావిస్తారు.

కానీ అలాంటి సినిమాల్లో నటించడం అనేది ఒక కళ.జాన్వీ ఇటీవల వచ్చిన దేవర సినిమాలో అద్భుతంగా నటించారు.

ప్రత్యేకించి చుట్టమల్లే సాంగ్‌ లో ఆమె హావ భావాలు చాలా బాగున్నాయి. """/" / ఒకే సమయంలో డ్యాన్స్‌ లో అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం కష్టం అంటూ ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు అవును అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది హీరోయిన్ జాన్వి కపూర్.ఇకపోతే అనన్య పాండే విషయానికి వస్తే.

కెరియర్ గురించి కంట్రోల్ సినిమా రిమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ.కంట్రోల్ సినిమాలో కొత్తగా ప్రయత్నించాను.

యాక్షన్ సినిమాలతో పాటు హర్రర్ సినిమాల్లో కూడా నటించాలని ఉంది.స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నేను ప్రేక్షకుడి కోణం నుంచి ఆలోచిస్తాను.

దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మినప్పుడే అందుకు అంగీకరిస్తాను.నటీనటులు కొత్తగా ప్రయత్నిస్తే ఎదుగుదల ఉంటుంది.

ప్రస్తుతం హాలీవుడ్‌ తరహా చిత్రాలు ఇక్కడ కూడా రూపొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది అనన్య పాండే.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…