అందాల అనన్య నాగళ్ల.. అలాంటి ఫోటోలు పెట్టడానికి వెనకాడని బ్యూటీ!

టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల గురించి మనందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా నటించే విషయం తెలిసిందే.

మొదటి ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తరువాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె నటించిన మల్లేశం, వకీల్ సాబ్ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ సాధించడంతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది.

ఇకపోతే ప్రస్తుతం అనన్య నాగళ్ల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.ఈ క్రమంలోనే వరుస హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ యువత గుండెల్లో గుబులు రేపుతోంది.

తాజాగా అనన్య నాగళ్ల చేసిన ఫోటో షూట్ కి సంబంధించి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సింపుల్ ఫ్లోరల్ ఫ్రాకులో ప్రత్యక్షమయ్యి రకరకాల భంగిమల్లో హొయలు పోయిన తీరుతో మత్తులోకి దించేస్తోంది ఈ అమ్మడు.

డిజైనర్ ప్రాకు కాంబినేషన్ గా మెడలో ముత్యాల హారం జత కుదిరింది. """/" / ఇలా ఈ అమ్మడు అందాల ఆరబోతతో నెమ్మదిగా స్పీడ్ ను పెంచుతుంది.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు అమ్మదొంగా సత్తుపల్లి పిల్ల స్పీడ్ పెంచింది అని కొందరు కామెంట్ చేయగా ఇంకొందరు ఇంతలోనే ఎంత స్పీడ్ పెంచింది అని ఇంకొందరు కామెంట్స్ చేశారు.

మరి కొందరు అయితే మెల్లి మెల్లిగా ఓపెన్ అవుతున్న తెలుగు అమ్మాయి అంటూ అనన్య నాగళ్ల లో వచ్చిన మార్పు గురించి ప్రస్తావిస్తున్నారు.

ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ముఖ్యపాత్రల్లో నటించిన శాకుంతలం సినిమాలో అనన్య కూడా కీలక పాత్రలో నటించింది.

త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది.

బిగ్ బాస్ హౌస్ లో వాళ్లిద్దరి మధ్య ప్రేమ.. నాగ మణికంఠ షాకింగ్ కామెంట్స్ వైరల్!