ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే క్రష్.. అనన్య నగళ్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో అనన్య నగళ్ల( Ananya Nagalla ) ఒకరు కాగా మల్లేశం, వకీల్ సాబ్ మరికొన్ని సినిమాల ద్వారా ఈ బ్యూటీ పాపులర్ అయ్యాయి.

పెద్ద సినిమాలలో కీలక పాత్రలలో సైతం నటిస్తూ ఈ బ్యూటీ మెప్పిస్తుండటం గమనార్హం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నగళ్ల ప్రభాస్ పై( Prabhas ) తన అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి రోల్ అయినా చేస్తానని ఆమె తెలిపారు.

వర్షం సినిమా( Varsham Movie ) చూసినప్పటి నుంచి ప్రభాస్ అంటే క్రష్ అని అనన్య నగళ్ల చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో నేను స్కూల్ లో చదువుకుంటున్నానని అనన్య నగళ్ల తెలిపారు.వర్షం సినిమాను నేను థియేటర్ లో చూడలేదని ఆమె అన్నారు.

బుల్లితెరపై ప్రసారమైన సమయంలో ఆ సినిమాను నేను చూడటం జరిగిందని అనన్య నగళ్ల పేర్కొన్నారు.

ఈ ఏడాది తంత్ర సినిమాలో విభిన్నమైన రోల్ లో నటించి ఆమె మెప్పించారు.

"""/" / అనన్య నగళ్ల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

అనన్య నగళ్ల నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే అవకాశం ఉంది.

అనన్య నగళ్ల క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అనన్య నగళ్ల రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పాత్రల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

"""/" / అనన్య నగళ్ల రెమ్యునరేషన్ పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఆఫర్లు పెరుగుతున్నాయి.

సోషల్ మీడియాలో సైతం అనన్య నగళ్ల మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

అనన్య ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అనన్య అనుష్క రేంజ్ హీరోయిన్ కావాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?