Ananya Nagalla : ఆ పెద్దాయన వచ్చి అన్న మాటలకు షాక్ అయ్యాను.. అనన్య నాగళ్ల కామెంట్స్ వైరల్!

తెలుగమ్మాయిలకు సినిమా ఆఫర్లు రావని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే.అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం సరైన ప్రాజెక్ట్ లతో ముందుకెళ్తే తెలుగమ్మాయిలకు కూడా ఎక్కువగానే ఆఫర్లు వస్తాయని ప్రూవ్ చేశారు.

అలా ప్రూవ్ చేసిన హీరోయిన్లలో అనన్య నాగళ్ల ( Ananya Nagalla ) ఒకరు.

కొన్నిరోజుల క్రితం తంత్ర అనే సినిమాతో అనన్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో జయాపజయాల కంటే జర్నీ ముఖ్యమని తెలుసుకున్నానని ఆమె తెలిపారు.

మనం ఎంచుకునేది రైటా? కాదా? అని తెలిసే సమయానికి సగం జీవితం అయిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు.

మాది ఖమ్మం( Khammam ) అని మధ్య తరగతి ఫ్యామిలీలో జన్మించానని అనన్య చెప్పుకొచ్చారు.

కేవలం సినిమాలను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చానని ఆమె పేర్కొన్నారు. """/" / మల్లేశం సినిమా( Mallesham Movie ) ఆడటంతో ఇంట్లో వాళ్లకు కూడా నాపై కాన్ఫిడెన్స్ వచ్చిందని అనన్య కామెంట్లు చేశారు.

వకీల్ సాబ్ ( Vakeel Saab )తర్వాత కొంత గ్యాప్ వచ్చిందని ఆ సమయంలో ఉద్యోగం వదిలి రావడం సరైన నిర్ణయమేనా అని అనిపించిందని అనన్య చెప్పుకొచ్చారు.

మల్లేశం మూవీ రిలీజ్ తర్వాత ఒక పెద్దాయన వచ్చి నువ్వు ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని సాఫ్ట్ వేర్( Software ) నుంచి వచ్చావని అనుకోలేదని చెప్పాడని ఆమె కామెంట్లు చేశారు.

"""/" / ఆ కామెంట్ నాకు పెద్ద కాంప్లిమెంట్ అని అనన్య నగళ్ల చెప్పుకొచ్చారు.

మొదట నేను అందంగా లేనా? ఈ ఇండస్ట్రీకి సరిపోనా అని అనిపించిందని ఆమె తెలిపారు.

ఇప్పుడు నాకు ఎలాంటి అభద్రతా భావం లేదని అనన్య వెల్లడించారు.అనన్య నగళ్ల వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

అనన్య నగళ్ల వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.