దుప్పట్లు సహాయం చేసి మంచి మనస్సు చాటుకున్న అనన్య.. ఈ హీరోయిన్ రియల్లీ గ్రేట్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ( Heroine Ananya Nagala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొదట నాగ మల్లేశం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

"""/" / ఇకపోతే అనన్య నాగళ్ల మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.మంచి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది.

మొన్నటికి మొన్న ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది.

తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది.తాజాగా అనన్య నాగళ్ళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.

"""/" / పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అనన్యను మరోసారి అంతా అభినందిస్తున్నారు.అనన్య రియల్లీ చాలా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హీరోయిన్ అయి ఉండి అంత సింప్లిసిటీగా మంచి పనులు చేస్తూ అందరితో సుభాష్ అనిపించుకోవడం నిజంగా చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ