బాప్‌రే... ఏం రియాక్షన్‌ ఇది.. చంద్రబాబు అంచనాలకు కూడా అందలేదు

మూడు రోజుల పర్యటన కోసం ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనకు వెళ్లారు.

అయితే అక్కడ జనాల నుంచి వచ్చిన స్పందన చూసి బాబు ఆశ్చర్యపోయారు.అనూహ్య రీతిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

పెద్ద ఎత్తున ప్రజలు హర్షధ్వానాలతో చంద్రబాబును ఆహ్వానించారు. """/"/అర్థంపర్థం లేని నిర్ణయాలతో ఏపీని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్తున్న జగన్‌ పాలనపై ఓ రకంగా విసుగు చెందిన ప్రజలు.

ఇలా మళ్లీ చంద్రబాబు వైపు చూస్తున్నట్లు ఆయన అనంతపురం పర్యటనతో స్పష్టమవుతోంది.జనం నుంచి వచ్చిన స్పందన చూసిన బాబు కూడా జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

రాజధానిని ముక్కలు చేసి దానినే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పడమేంటని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అమరావతిలో రాజధాని పెట్టి.విశాఖను ఆర్థిక కేంద్రంగా చేయడానికి తాను ప్రయత్నించానని, అందులో భాగంగా అక్కడ డేటా సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేసినట్లు వెల్లడించారు.

అదే జరిగి ఉంటే ఇప్పుడు విశాఖ.హైదరాబాద్‌ను మించిపోయేదని, దానిని వైసీపీ వాళ్లు తరిమేశారని అన్నారు.

"""/"/చట్టాన్ని తాను ఉల్లంఘించానని అనుకుంటే దిక్కున్న చోట చెప్పుకోవాలని, తనపై అనవసరంగా నిందలు వేస్తే మాత్రం ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

ఓనమాలు కూడా రాని సీఎం జగన్‌ అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.టోలు గేటుపై చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో కరెంటు లెక్కలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.

వైరల్ వీడియో : ఆకతాయిలకు బస్సు డ్రైవర్ బలే బుద్ది చెప్పాడుగా