అనంతపురంలో కరెన్సీ కలకలం

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.

దీంతో చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంతవరకు మాస్కులు, సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞాప్తి చేశారు.

అంతేకాకుండా దేశంలో లాక్ డౌన్ లో సడలింపులు తీసుకొచ్చారు.దీంతో వ్యాపారులు మళ్లీ వ్యాపారం మొదలు పెట్టారు.

వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి.ఇలాంటి తరుణంలో అనంతపురంలో కరెన్సీ కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అనంతపురం ఆర్టీసీ బస్టాండులో పోలీసులు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలల్లో ఓ ప్రయాణికుడి దగ్గర భారీగా నగదు దొరికింది.అయితే ప్రయాణికుడు ఈ డబ్బును పసిడి కొనుగోలు చేసేందుకు బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు తెలియజేశాడు.

పోలీసులు విచారణ నిమిత్తం ప్రయాణికుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.నగదు యజమాని పోలీసులకు పూర్తి ఆధారాలు చూపించాడు.

దీంతో పోలీసులు వివరాలు సేకరించి ప్రయాణికుడికి నగదు ఇచ్చి పంపించమని తెలిపారు.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మరి వైరల్ అవుతుంది.

బాధ్యులపై కఠిన చర్యలు..అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశం