Anand Sai : నాకు ఉన్న స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఆనంద్ సాయి కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

జనసేన పార్టీ( Janasena Party ) ఎన్ని స్థానాలలో ఎన్నికల్లో పోటీ చేస్తుందో అతి త్వరలో క్లారిటీ రానుంది.

ఏపీలో ఈ ఏడాది ఎన్నికల్లో జనసేన చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

పవన్ సన్నిహితులలో ఒకరైన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.

ఆర్ట్ డైరెక్టర్( Art Director ) గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆనంద్ సాయి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో నా జర్నీ బ్యూటిఫుల్ జర్నీ అని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని ఆనంద్ సాయి అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/"/ నన్ను ఆర్ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

పవన్ కు అప్పట్లో ఉన్న అతికొద్ది మంది ఫ్రెండ్స్ లో నేను ఒకడినని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ అంశాల( Political ) గురించి నేను మాట్లాడనని ఆనంద్ సాయి( Anand Sai ) అభిప్రాయపడ్డారు.

రాజకీయాల గురించి నాకు అవగాహన లేదని ఆయన అన్నారు.కళ్యాణ్ గారు కూడా నాతో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడరని ఆనంద్ సాయి వెల్లడించారు.

పవన్ యాక్టింగ్ లో కూడా ఎవరి ఇన్ఫ్లూయెన్స్ ఉండదని ఆయన అన్నారు.డైరెక్టర్లను నమ్మి పవన్ ముందుకెళ్తాడని ఆనంద్ సాయి తెలిపారు.

"""/"/ పవన్ సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కొంత గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.

మేము ఒకరినుంచి మరొకరు ఏదీ ఆశించమని ఆయన కామెంట్లు చేశారు.పవన్ తప్ప నాకు స్నేహితులెవరూ లేరని ఆనంద్ సాయి వెల్లడించారు.

హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్ పవన్ మాత్రమేనని ఆయన తెలిపారు.

అలాంటి ప్రశ్నలు మాత్రం అస్సలు అడగొద్దు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!