వైట్‌హౌస్‌లో డిన్నర్‌ చేయడం కోసం కడుపు మాడ్చుకున్నా: ఆనంద్‌ మహీంద్ర

ప్రముఖ దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) తన అభిమానులను ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూనే వుంటారు.

ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అంశాలను షేర్ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ వుంటారు.బుధవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్‌ చెక్‌ లీగ్‌ గురించి ట్వీట్‌ చేసిన మహీంద్ర గురువారం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టారు.

వైట్‌హౌస్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) గౌరవార్థం వాషింగ్టన్‌లోని స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్‌ చేసారు.

ఈ సందర్భంగా అక్కడ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికిన తీరు, థీమ్‌ వంటలపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు ఆనంద్ మహీంద్రా.

"""/" / అంతేకాకుండా స్టేట్ డిన్నర్‌లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌( First Lady Jill Biden ) హోస్ట్ చేసే విందును కడుపారా ఆరగించేందుకు మధ్యాహ్న భోజనాన్ని స్కిప్‌ చేశానంటూ తనదైన శైలిలో ఇక్కడ చమత్కరించడం కొసమెరుపు.

ఇకపోతే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారి వైట్ హౌస్‌లో( White House ) పూర్తిగా వెజిటేరియన్ ఆధారిత విందును నిర్వహించడం విశేషం.

మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు లాంటివేవీ లేకుండా పూర్తిగి శాఖాహారాన్ని వడ్డించారు మరి.

"""/" / 400 మంది వీవీఐపీలు హాజరైన ఈ డిన్నర్‌కు మైక్రోసాఫట్‌ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్ పిచాయ్, ఇంకా యాపిల్‌ సీఈవో టిమ్ కుక్, సహా ఆసియా బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ దంపతులు, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్, పెప్సికో మాజీ చైర్‌పర్సన్ సీఈవో ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లాంటి పలువురు ప్రముఖులతో కలిసి స్టేట్ డిన్నర్‌లో సందడి చేశారు నరేంద్ర మోడీ.

ఈ నేపథ్యంలో సదరు వీడియోని సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేస్తూ 'వైట్‌హౌస్‌లో డిన్నర్‌ చేయడం కోసం కడుపు మాడ్చుకున్నా! అంటూ చాలా చమత్కారంగా రాసుకొచ్చారు.

కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.

అలాంటి విందును ఆరగించడంకోసం కడుపుని మాడ్చుకోవడం తప్పు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..