పట్టుదల ఉంటే విజయం సాధ్యమే.. ఆనంద్ మహీంద్రా షార్ట్ స్టోరీ వైరల్!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆయనకు 90 లక్షల ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.66 ఏళ్ల వయసులోనూ కుర్రాడి లాగా ఆలోచించే ఆనంద్ మహీంద్రా నెటిజన్లను ఆకట్టుకునేలా పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో 12 లక్షల వ్యూస్ తో, 83 వేల లైక్ లతో ట్విట్టర్ ని ఒక ఊపు ఊపేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పిల్లాడు చేపలు పట్టేందుకు ఫిషింగ్ స్టిక్ లాంటి ఒక చేపలు పట్టే స్టాండింగ్ టూల్ ను చెరువు ముందు ఏర్పాటు చేయడం చూడొచ్చు.

ఆ తర్వాత ఒక తాడుకి పిండి ముద్దలను ఎరగా కట్టి నీటిలో విసరడం గమనించవచ్చు.

తర్వాత సహనం గా వెయిట్ చేశాడు.ఇంతలోనే పిండి ముద్దలను తిన్న చేపలు ఎరకు చిక్కడంతో తాడు కదలడం మొదలైంది.

ఇది గమనించిన ఈ బాలుడు వాటిని వెంటనే బయటకు లాగాడు.అలా ఈ చిన్నోడు తన సైజు ఉన్న రెండు పెద్ద చేపలను పట్టుకోగలిగాడు.

ఆ తర్వాత ఆ చేపలను తన సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

"""/"/ ఈ చిన్న వీడియో క్లిప్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ షార్ట్ స్టోరీ చెప్పారు ఆనంద్ మహీంద్రా.

"పట్టుదల, దృఢ సంకల్పం, చాతుర్యం, సహనం అన్నీ కలిస్తే విజయం వరించడం ఖాయం.

" అని ఈ వీడియోకి ఒక తగిన క్యాప్షన్ జోడించారు ఆనంద్.అయితే ఈ షార్ట్ స్టోరీ విని చాలా మంది నెటిజన్స్ వావ్ అంటున్నారు.

కానీ కొందరు మాత్రం చేపల దయనీయ పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు.ఈ రెండు చేపలు ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్నాయని, ఇది చూసేందుకు గుండె తరుక్కుపోతోందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

వేపాకుతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది!