దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ప్రీతి కొంగర.. ఆనంద్ మహీంద్ర ఫిదా
TeluguStop.com
మట్టిలో మాణిక్యాలు మన వద్ద చాలా మంది ఉంటారు.వారిని సానపెడితే ఎన్నో అద్భుత ఫలితాలు సాధిస్తుంటారు.
ఇదే కోవలో తెలంగాణకు చెందిన ప్రీతి కొంగర ఎన్నో విజయాలను సాధిస్తోంది.ముంబైలోని బాంబే హార్బర్‌లో జరిగిన 1వ ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ మరియు సీనియర్ నేషనల్స్‌లో తెలంగాణకు చెందిన ప్రీతి కొంగర 470 మిక్స్‌డ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
కాగా, ఇదే విభాగంలో మరో నావికురాలు ధరణి లావేటి కాంస్య పతకం సాధించింది.
వీరిద్దరూ భారత నౌకాదళానికి చెందిన పురుషులతో జత కట్టి టోర్నీలో మెరిశారు.సుధాన్షు శేఖర్‌తో జతకట్టిన ప్రీతి 12 రేసుల్లో ఆరింటిలో విజయం సాధించి నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది.
ఆమె స్పూర్తిదాయక కథను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వీడియో పోస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ట్విట్టర్‌లో చురుగ్గా ఉంటారు.
దేశంలోని నలుమూలల నుంచి ప్రతిభ చూపే వ్యక్తుల గురించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
"""/" /
ఆయన ట్విట్టర్‌లో తాజా పోస్ట్ కూడా ఓ సాధారణ మహిళ సాధించిన అసాధారణ విజయాల గురించి ఉంది.
తన సెయిలింగ్ నైపుణ్యంతో సముద్రాన్ని జయించిందని పేర్కొన్నారు.అంతర్జాతీయ వేదికపై అసాధారణ విజయాలను సాధించిందని ఆయన తెలియజేశారు.
ప్రీతి తెలంగాణలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
అయితే చక్కటి శిక్షణ, సరైన మార్గనిర్దేశకత్వంతో ఆమె దేశం గర్వపడేలా చేసిందని మహీంద్రా పేర్కొన్నారు.
"""/" /
నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ తొలుత ప్రీతి కొంగరకు సంబంధించిన పోస్ట్ చేశారు.
దీనిని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.ప్రీతి కొంగర చిన్నప్పటి ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.
అందులో ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు ఉంది.అలాంటి స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆమె ఎదగడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు పేర్కొంటున్నారు.
కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఐకాన్ స్టార్.. ఫొటో వైరల్