ఏడుస్తున్న పిల్లోడిని ఓదార్చిన కుక్క.. బ్యూటిఫుల్ వీడియో వైరల్..
TeluguStop.com
నిజమైన స్నేహితులు రక్తసంబంధం లేకపోయినా మన ఫ్యామిలీలో ఒకరైపోతారు.ఇది నిజమే.
రక్తసంబంధం లేనివారితో కూడా మంచి అనుబంధం ఏర్పరచుకోగలం.ఈ స్నేహం మనుషులతోనే కాదు పెంపుడు జంతువులతో( Pet Animals ) కూడా ఏర్పడుతుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఈ పవిత్రమైన బంధం గురించి తెలియజేస్తూ ఇటీవల ఓ బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు.
ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే( International Friendship Day ) సందర్భంగా ఆయన ఈ వీడియో పంచుకున్నారు.
ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుండగా అతని పెంపుడు జంతువు ఓదార్చుతున్న చాలా అందమైన వీడియోను పంచుకున్నారు.
"""/" /
ఆ 39 సెకన్ల వీడియోలో ఒక చిన్న బాలుడు( Kid ) సోఫాకు ఆనుకుని కూర్చుని గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
చిన్న పిల్లవాడు ఇంతగా ఏడ్వడం చూస్తే ఎవరికైనా సరే చాలా బాధేస్తుంది.ఆ పిల్లోడికి కూడా అది పెద్ద విషయమే అయి ఉండాలి.
అదృష్టవశాత్తూ, ఆ బుడ్డోడికి చాలా అందమైన స్నేహితుడు ఉన్నాడు.అదే అతని పెంపుడు కుక్క,( Pet Dog ) అది ఈ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ముందుగా అతని దగ్గరకు వస్తుంది.
ఆ తర్వాత అబ్బాయి ముఖం తుడవడానికి టిష్యూ తీసుకొని వచ్చి, అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది.
"""/" /
కొంతవరకు ఓదార్చుకున్న అబ్బాయి తన అందమైన స్నేహితుడిని చూసి కౌగిలించుకుంటాడు.
ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే నాడు నిజమైన స్నేహం గురించి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.
అందరూ ఈ వీడియో బ్యూటిఫుల్‌గా ఉందని కామెంట్లలో పేర్కొన్నారు.ఆ వీడియో ఆగస్టు 4న దీనికి నాలుగున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
14 వేల లైక్‌లు, 520 కామెంట్లు వచ్చాయి."నిజమైన స్నేహితులు ప్రతి కన్నీటిని పంచుకుంటారు" అని ఒక ఎక్స్ యూజర్ రాశారు.
"స్నేహం ప్రత్యేకమైన వ్యక్తులతో మాత్రమే ఉండదు.మనం స్నేహితులుగా ఉండే వ్యక్తులే ప్రత్యేకంగా మారుతారు.
" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
గుండెలు అదిరే వీడియో.. గూడ్స్ రైలు కింద నుజ్జుకావాల్సిన వ్యక్తి.. ఎలా బతికాడో చూడండి!?