Anand Mahindra : ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. కంటతడి పెట్టుకుంటున్న నెటిజన్లు!
TeluguStop.com
చిన్నపిల్లలది కల్మషం లేని మనసు.ఎవరైనా బాధపడుతున్నా, ఏడుస్తున్నా వారు ఓదార్చడానికి ముందుకు వస్తుంటారు.
తమకు చేతనైన సాయం చేయడానికి ట్రై చేస్తుంటారు.ఆ చిన్న పిల్లల వీడియోలు చూస్తే హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుంటాయి.
అలాంటి వీడియో మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో ఒక పిల్లవాడు విచారంగా ఉన్న గోల్‌కీపర్‌ను కౌగిలించుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు.
అర్జెంటీనాలో ఫుట్‌బాల్ మ్యాచ్( Football Match In Argentina ) ముగిసిన తర్వాత ఆ బాలుడు మైదానంలోకి పరుగెత్తాడు.