నకిలీ బ్రాండ్‌పై ఆనంద్ మహీంద్రా చమత్కారం.. అడిడాస్ పేరును ఏమని రాశారంటే
TeluguStop.com
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా చమత్కారమైన పోస్ట్‌లు నెటిజన్‌లకు ఆసక్తిని కలిగిస్తాయి.
ఆయన నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.ఎన్నో ఆసక్తికరమైన, నవ్వు పుట్టించే, ఏదైనా స్పూర్తిని అందించే పోస్టులను తరచూ షేర్ చేస్తుంటారు.
వాటికి నెటిజన్ల నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది.తాజాగా ప్రముఖ బ్రాండ్ అడిడాస్ సంస్థను పోలి ఉండే నకిలీ బ్రాండ్ గురించి ఆయన చేసిన ఫన్నీ పోస్ట్ నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
అడిడాస్‌ను పోలి ఉండేలా అజిత్ దాస్ అనే పేరుతో 'షూ' ఆయన చేసిన పోస్ట్‌లో కనిపిస్తోంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఎంత పెద్ద ప్రముఖ బ్రాండ్ అయినా, వాటికి నకిలీల బెడద ఉంటుంది.
ఇది యాపిల్ ఐ ఫోన్ల నుంచి మనవం ఇంట్లో వాడే ప్లాస్టిక్ కుర్చీలు నీల్ కమల్ వరకు అన్ని బ్రాండ్లకు డూప్లికేట్ సమస్య తప్పట్లేదు.
తాజాగా ఈ పరిస్థితి ప్రముఖ ఫుట్ వేర్ సంస్థ అడిడాస్‌కు వచ్చింది.అడిడాస్ పేరును అజిత్‌దాస్‌గా మార్చేసి, అచ్చం అడిడాస్ షూలను పోలి ఉండే నకిలీ షూలను తయారు చేసేశారు.
ఈ నకిలీ అడిడాస్ షూ ఫొటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
"""/"/
ప్రముఖ పాదరక్షల బ్రాండ్ యొక్క భారతీయ వెర్షన్ అనే అర్ధం వచ్చేలా చమత్కారంతో ఆయన ఫొటో షేర్ చేశారు.
ఆదికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడు.వసుధైవ కుటుంబం అని క్యాప్షన్ ఇచ్చారు.
మహీంద్రా ట్వీట్ చేసిన వెంటనే, చాలా మంది ట్విటర్ యూజర్లు తమదైన కామెంట్లతో హాస్యం పుట్టిస్తున్నారు.
“ఆదికి సోదరుడు 'అజిత్'తో పాటు 'అదా' సోదరి కూడా ఉన్నందున వసుధైవ్ కుటుంబానికి మరింత శక్తి ఉందని కొందరు వ్యాఖ్యానించారు.
"బహుశా దాని అడిడాస్ సోదరుడు కుంభమేళాలో ఓడిపోయి ఉండవచ్చు" వంటి కొందరు కామెంట్లు చేశారు.