అమ్మాయిలతో మాట్లాడటానికి రెండు సంవత్సరాలు సమయం పట్టింది: ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) .

ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఆనంద్ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా సాయి రాజేష్( Sai Rajesh ) దర్శకత్వంలోతెరకెక్కిన బేబీ సినిమా( Baby Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆనంద్ దేవరకొండ పలు విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సినిమాలో స్కూల్ ఏజ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టినట్లు మనకు ట్రైలర్ లో చూపించారు.

అయితే ఈయన తన జీవితం గురించి మాట్లాడుతూ తాను పదవ తరగతి వరకు బాయ్స్ బోర్డింగ్ స్కూల్లోనే పూర్తి చేసానని తెలిపారు.

అయితే అమ్మాయిలు లేకపోవడంతో తనకు బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం వేసేదని తెలిపారు.

ఈ విధంగా పదో తరగతి పూర్తి చేసిన రెండు సంవత్సరాల వరకు నాకు అమ్మాయిలతో మాట్లాడటానికి భయంగానే ఉండేదని అమ్మాయిలతో మాట్లాడటానికి తనకు రెండు సంవత్సరాల సమయం పట్టింది అంటూ ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక తన ఫస్ట్ లవ్ గురించి కూడా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ అందరిలాగే తనకు తన ఫస్ట్ లవ్ ఎప్పటికీ స్పెషల్ అని తెలియజేశారు.

ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన సక్సెస్ అయిన అది ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమొరీ గా ఉంటుందని ఈయన తెలిపారు.

ఇక ఈ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రేమ అనంతమైనది కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రేమను డైరెక్టర్ సాయి రాజేష్ ఆయన కోణంలో నుంచి సరికొత్తగా చూపించారు అంటూ బేబీ సినిమా గురించి ఈయన తెలియజేశారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని ఇప్పటికే ప్రీమియర్ షో హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటూ ఆనంద్ దేవరకొండ తెలిపారు.

వీడియో: ఇదెక్కడి పిచ్చి పని.. ఫైర్‌క్రాకర్ బాక్స్‌పై కూర్చోబెట్టి చంపేశారు..?