‘బేబీ’పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికీ ఆనంద్ దేవరకొండ స్ట్రాంగ్ రిప్లై!

ఈ మధ్యకాలంలో సినిమాలలో ఏ చిన్న పాయింట్ దొరికిన ట్రోల్స్ చేయడానికి ట్రోలర్స్ సిద్ధంగా ఉన్నారు.

అది చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన ట్రోలర్స్ చేతికి చిక్కితే దానిని ఒదిలిపెట్టరు.

మరి తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ''బేబీ( Baby Movie)'' సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాను ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్( Sai Rajesh ) తెరకెక్కించాడు.

కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన సాయి రాజేష్ తాజాగా లవ్ స్టోరీ తెరకెక్కించడంతో ముందు నుండి మంచి హైప్ ఉంది.

ఇక ఈ సినిమాలో సాంగ్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. """/" / అయితే ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో వారిలో కొంత మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

ముందు నుండి ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్యను డీ గ్లామరస్ గా చూపించడంపై పలువురు ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరి తాజాగా వచ్చిన ట్రైలర్ తర్వాత కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.దీంతో ఈ విషయంపై హీరో ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ ట్రోల్స్ చేసే వారికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

"""/" / హీరోయిన్ గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ఆనంద్ పోస్ట్ చేస్తూ ''నిజానికి ఇలాంటి కామెంట్స్ అనవసరం అనే చెప్పాలి.

ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పండి మీ అభిప్రాయాన్ని'' అంటూ ఈయన సాలిడ్ ఆన్సర్ ఇచ్చి అందరి నోళ్లు మూయించారు.

నిజానికి ఈ మధ్య టీజర్, ట్రైలర్ చూసేసి సినిమా మొత్తాన్ని డిసైడ్ చేసేస్తున్నాం.

కానీ అది కరెక్ట్ కాదు.సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు ఆ సినిమాపై ఒక అభిప్రాయానికి రావడం ఉత్తమం.

ఇక ఈ సినిమా జులై 14న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?