హిట్ పడ్డా ఆనంద్ దేవరకొండకు ఆనందం లేదా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) హీరోగా దొరసాని సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

మొదటి సినిమా నిరాశ పరిచింది.అయితే ఆ సినిమా లో శివాత్మిక రాజశేఖర్‌ నటించడం తో అందరి చూపు ఆమె వైపు మళ్లింది.

ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం జరిగింది.కానీ ఆనంద్ దేవరకొండ గురించి ఆ సమయంలో మాట్లాడుకోలేదు.

దాంతో మళ్లీ గుర్తింపు కోసం ఆనంద్ దేవరకొండ చాలా ప్రయత్నాలు చేశాడు.ఆ మధ్య మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా( Middle Class Melodies ) తో ప్రేక్షకులను అలరించాడు.

"""/"/ కానీ ఆ సినిమా ఓటీటీ కే పరిమితం అవ్వడంతో కమర్షియల్‌ హిట్( Commercial Hit ) దక్కినట్లు అవ్వలేదు.

ఇతర సినిమా లు ఏవి కూడా ఆనంద్ దేవరకొండ కి పెద్దగా సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు.

దాంతో ఎలాగైనా ఒక మంచి కమర్షియల్‌ హిట్ దక్కించుకోవాలని ఆశ పడ్డ ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ను చేశాడు.

సాయి రాజేష్ దర్శకత్వం లో ఎస్ కే ఎన్ నిర్మించిన బేబీ సినిమా( Baby Movie ) కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

సినిమా గురించి ట్రోల్స్‌.మీమ్స్ వచ్చినా కూడా వాటన్నింటిని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమా ను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.

"""/"/ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ సాధించి కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

కానీ ఆనంద్ దేవరకొండ కు ఆ సినిమా సక్సెస్‌ పెద్దగా కిక్‌ ఇస్తున్నట్లుగా లేదు.

ఎందుకంటే ఆనంద్ దేవరకొండ హిట్ పడ్డా కూడా పెద్దగా లాభం లేదు అన్నట్లుగా ఉంది.

మొత్తం సక్సెస్ క్రెడిట్‌ కూడా హీరోయిన్ వైష్ణవి( Vaishnavi Chaitanya ) కి పోయిందని.

ఆమె అద్భుతమైన నటన.పాత్ర వల్లే సినిమాకు మంచి టాక్ వచ్చింది అనేది చాలా మంది అభిప్రాయం.

అందుకే ఆనంద్ దేవరకొండ కి బేబీ సక్సెస్ క్రెడిట్ దక్కడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఏపీ ,తెలంగాణ సీఎంల మధ్య వీటి పైనే చర్చ ?