సినిమా కోసం అలాంటి టాటూ వేయించుకున్న ఆనంద్ దేవరకొండ.. అర్థమేంటో తెలుసా?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) .

ఈయన విభిన్నమైన కథలని ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇటీవల బేబీ సినిమా ( Baby Movie ) ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆనంద్ దేవరకొండ త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

గం గం గణేశా( Gam Gam Ganesha ) సినిమా ద్వారా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

"""/" / ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఆనంద దేవరకొండ మెడ పై ఒక టాటూ కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈయన మీద పై ఉన్నటువంటి టాటుకి అర్థం ఏంటి అనే విషయం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఆ టాటూ చైనీస్ భాషలో ఉండటం విశేషం.

"""/" / ఇక ఈ టాటూ వెనక సీక్రెట్ గురించి ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.

రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒక టాటూ ఉండాలన్న ఉద్దేశంతో వెతికి మరి డైరెక్టర్ ఈ టాటూ వేయించారని తెలిపారు.

చైనా భాషలో దీన్ని గూగుల్ లో డీకోడ్ చేస్తే ఫ్యామిలీ అని వచ్చింది.

మీరంతా, సినీ పరిశ్రమ అంతా నా ఫ్యామిలీనే.అందుకే ఇలా ఫ్యామిలీ అనే టాటూ తీసుకున్నాం.

అయితే తాను వేయించుకున్న ఈ టాటూ పర్మనెంట్ టాటూ కాదని,సినిమా కోసమే టెంపరరీ స్టిక్కర్ టాటూ వేయించుకున్నట్టు తెలుస్తోంది.

  ఇది వరకు ఈ సినిమా ప్రమోషన్లలో కనిపించని ఈ టాటూ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కనిపించడంతో కేవలం సినిమా కోసమే ఈ టాటూ వేయించుకున్నారని తెలుస్తుంది.

ఏందిది, క్లాస్‌రూమ్‌లోకి వచ్చేసిన బర్రె.. డిగ్రీ చేస్తుందట.. వీడియో సీన్ చూస్తే నవ్వాపుకోలేరు!