ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ ప్రివ్యూ
TeluguStop.com
జూనియర్ రౌడీ స్టార్ ఆనంద్ దేవరకొండ ( Anand Deverakonda )హీరోగా వైష్ణవి హీరోయిన్ గా రూపొందిన బేబీ( Baby ) చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గతంలో సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలేయం అనే సినిమాను రూపొందించి ఆ తర్వాత పలు సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి రాజేష్ ( Sai Rajesh )ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
కలర్ ఫోటోకి ఈయనే నిర్మాత అనే విషయం తెలిసిందే.మెగా కాంపౌండ్ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బేబీ చిత్రాన్ని నిర్మించాడు.
ఆనంద్ దేవరకొండ సినిమా అవడం తో ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
అంతే కాకుండా టీజర్ విడుదలైంది మొదలు సినిమా గురించి జనాలు ఆసక్తి కలిగే విధంగా మేకర్స్ విభిన్నంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
దాంతో సినిమా కి మంచి రీచ్ వచ్చింది అనడంలో సందేహం లేదు. """/" /
తాజాగా వచ్చిన ట్రైలర్( Trailer ) సినిమా గురించి జనాల్లో మరింతగా చర్చ జరిగేలా చేసింది.
పల్లెటూరు అమ్మాయి కాలేజ్ కోసం సిటీకి వెళ్లి అక్కడ ఎలా మారింది.మొదటి ప్రేమ ను మర్చి పోయిందా.
కాలేజీలో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందా.అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు.
విభిన్నమైన ప్రేమ కథ చిత్రం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పదే పదే చెబుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
రేపు ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ బాగానే జరిగినట్లు మేకర్స్ చెప్తున్నారు.
ఆనంద దేవరకొండ కి ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందిస్తుంది అంటూ రౌడీ ఫ్యాన్స్ ధీమా తో ఉన్నారు.
ఆ మధ్య విడుదలైన కలర్ ఫోటో సినిమా కి కాస్త అటు ఇటుగా ఈ సినిమా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి బేబీ రేపు ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది అనేది చూడాలి.
వైరల్: కోయ్ కోయ్ ‘పాస్టర్’ పాటలో అంత డెప్త్ వుందా?