మళ్లీ థియేటర్లకు రప్పించే ప్రయత్నాల్లో ‘బేబీ’
TeluguStop.com
ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )జంటగా సాయి రాజేష్ దర్శకత్వం లో రూపొందిన బేబీ సినిమా మూడు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చిన్న సినిమా గా విడుదల అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.ఆకట్టుకునే కథ మరియు కథనం తో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఆ పై పాతిక కోట్ల వసూళ్లు కూడా రాబట్టేదే వర్షాలు అడ్డు రావడంతో పాటు ఇంతలో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా( Bro Movie ) విడుదల అయింది.
"""/" /
బేబీ మేకర్స్ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా బేబీ కోసం మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసం కొత్త కంటెంట్ ను యాడ్ చేస్తున్నారట.
సినిమా ను రీ ఎడిట్ చేసి పది నిమిషాలు అన్ వాంటెడ్ తొలగించి కొత్త కంటెంట్ దాదాపుగా 15 నుండి 20 నిమిషాల పాటు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే కచ్చితంగా కొత్త ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇప్పటికే సినిమా ను చూసిన వారు మళ్లీ థియేటర్ల ముందు క్యూ కట్టే అవకాశం ఉంది.
"""/" / రెండు లేదా మూడు రోజుల పాటు సాలిడ్ వసూళ్లు నమోదు అయితే చాలు ఆ వంద కోట్ల క్లబ్ లో సినిమా జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బేబీ సినిమా కు బ్రో సినిమా అడ్డు కాదని.ఏ సినిమా దారి దానిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కొందరు మాత్రం కచ్చితంగా బేబీ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
బ్రో సినిమా కి హిట్ టాక్ దక్కి ఉంటే బేబీ సినిమా ను జనాలు మర్చి పోయే వారు.
కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.బేబీ సినిమా( Baby Movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి…