ఆ మ్యాజిక్ నెంబర్ దాటడం ఇక బేబీకి కష్టం ఏమీ కాదు
TeluguStop.com
ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda )హీరోగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా రూపొందిన బేబీ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
చిన్న సినిమా అంటూ మొదట బేబీ ని ఎవరు పట్టించుకోలేదు.విడుదల అయిన రోజే బేబీ గురించి వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
ఆ వర్షాల్లో కూడా బేబీ సినిమా ను చూసేందుకు థియేటర్ కు జనాలు క్యూ కడుతున్నారు.
ఇప్పటి వరకు బేబీ సినిమా 75 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.
ఆ వర్షాలు లేకుంటే కచ్చితంగా ఇప్పటి వరకు వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి.
అయినా కూడా ఇప్పుడు రూ.75 కోట్ల రూపాయలు అనేది కచ్చితంగా మ్యాజిక్ నెంబర్.
"""/" /
అలాంటి భారీ వసూళ్లు సాధించడం అనేది కరోనా తర్వాత స్టార్ హీరోలకు కూడా కాస్త కష్టంగా మారింది.
బాలీవుడ్ సినిమా ( Bollywood )లు గత రెండేళ్లుగా 50 కోట్ల వసూళ్లు సాధిస్తేనే వావ్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.
అలాంటిది బేబీ సినిమా మ్యాజిక్ నెంబర్ 75 కోట్ల రూపాయలను చేరుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
బుదవారం వరకు సినిమా 73 కోట్ల రూపాయలు సాధించింది. """/" / రూ.
75 కోట్ల ను చేరుకోవడం కష్టం కాదని అంతా అనుకున్నారు.అనుకున్నట్లుగానే చాలా ఈజీగానే బేబీ సినిమా( Baby Movie ) ఆ మార్క్ ను క్రాస్ చేసింది.
ఒక వైపు వసూళ్ల వర్షం కురుస్తూ ఉంటే మరో వైపు సినిమా కు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇలాంటి మంచి సినిమా ను తీసినందుకు.ఇలాంటి మంచి నటన ప్రదర్శించినందుకు అంటూ యూనిట్ సభ్యుల గురించి సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.