‘బేబీ’ 4 రోజుల కలెక్షన్స్.. సునామీ సృష్టిస్తుందిగా..
TeluguStop.com
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Devarakondam ) విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతున్న ఈయనకు బ్రేక్ రాలేదు అనే చెప్పాలి.
గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ హీరోగా ఎదగలేక పోయాడు.అయితే తాజాగా ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. """/" /
ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఈ సినిమా 4 రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ ( Baby Movie )యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం హీరోయిన్ బోల్డ్ రోల్ కావడంతో ఈ సినిమా కుర్రాళ్లకు మరింతగా నచ్చేసింది.
ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.
జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.
ఇక మొదటి షో నుండే మంచి టాక్ అందుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా రాబట్టింది.
ఇక ఓపెనింగ్స్ కంటే ఆ తర్వాత భారీగా వసూళ్లు సాధిస్తుంది. """/" /
ఇక 4వ రోజు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా మొదటి రోజు 7 కోట్ల పైగానే కలెక్షన్స్ రాబట్టింది.ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా 7 కోట్లకు పైగానే రాబట్టింది.
ఇక నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.
మరీ ముఖ్యంగా సోమవారం రోజు ఈ సినిమా మొదటి రోజు కంటే ఎక్కువగా రాబట్టింది.
కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.
మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. దివ్య శ్రీధర్ కామెంట్స్ వైరల్!