కలెక్టర్ ఫోటోతో గిఫ్ట్ కార్డ్.. రూ.50 వేలు చెల్లించి సైబర్ వలలో చిక్కిన ఆర్డీవో..!

ఇటీవలే కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అమాయకులను ట్రాప్ చేసి వారి నుండి డబ్బులు దోచుకోవడమే ఈ సైబర్ నెరగాళ్ల పని.

ఒకపక్క సైబర్ నేరగాళ్ల గురించి అవగాహన కల్పిస్తున్న కూడా మరొక పక్క అమాయకులు అత్యాశతో బలి అవుతూనే ఉన్నారు.

ఏకంగా అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం కలెక్టర్ ఫోటోతో వచ్చిన షాపింగ్ గిఫ్ట్ కార్డు ను చూసి ఆర్డీవో చిన్నికృష్ణ రూ.

50 వేలు చెల్లించి సైబర్ నేరగాళ్ల చేతిలో అడ్డంగా మోసపోయాడు. """/" / ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు చాలావరకు ఇలానే ఉంటాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

మొదట కలెక్టర్ ఫోటోతో షాపింగ్ కార్డు అందితే వెంటనే స్పందించి 50 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒకవేళ చెల్లించాలి అనుకుంటే కలెక్టర్ ను కాకపోయినా కలెక్టర్ కార్యాలయ సిబ్బందితోనైనా మాట్లాడి ఉంటే అసలు విషయం తెలిసేది.

అయితే కలెక్టర్ ఫోటో ఉంది కదా అన్ని ముందు వెనక ఆలోచించకుండా కేవలం కలెక్టర్ అంటే భక్తితోనో లేదా భయంతోనో ఆర్డీవో డబ్బు చెల్లించి ఉండవచ్చు.

కానీ అవేమీ ఆలోచించకుండా ఒక పెద్ద హోదాలో ఉండే వ్యక్తి ఇలా డబ్బులు చెల్లించి మోసపోవడం చర్చనీయాంశంగా మారింది.

"""/" / రూ.50 వేలు చెల్లించిన తరువాత ఆర్డీవో, ఆ సొమ్ముకు సంబంధించిన వివరాలు ఆరా తీయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.

తరువాత పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారణ జరిపి నిందితుడు డెహ్రాడూన్ నుంచి మోసానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని, డెహ్రాడూన్ లో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్డీవో మోసపోయిన రూ.50 వేల కోసం.

పోలీసులు డెహ్రాడూన్ వెళ్లి నిందితున్ని అరెస్టు చేసి తీసుకువచ్చేందుకు ఒక లక్ష 30 వేలు ఖర్చయింది.

నవంబర్ 13న జో బైడెన్‌తో భేటీ కానున్న డొనాల్డ్ ట్రంప్