పెళ్లిలో వధువుకు ఎవరూ ఊహించని గిఫ్ట్.. చూస్తే నవ్వుకుంటారు
TeluguStop.com
పెళ్లి ( Marriages )అనేది జీవితంలో ప్రతిఒక్కరికీ ఒక మరువలేని జ్ఞాపకం.జీవితాంతం పెళ్లి గుర్తులను దాచిపెట్టుకుంటారు.
ఫొటోలు, వీడియోల రూపంలో పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది.
అందుకే మిత్రులు, కుటుంబసభ్యులందరినీ పిలుస్తారు.అత్యంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు.
బంధుమిత్రులు, స్నేహితుల సందడితో పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు.అయితే పెళ్లికి వచ్చే అతిథులు రకరకాల బహుమతులు తెస్తూ ఉంటారు.
ఒకప్పుడు డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది.కానీ ఇప్పుడు గిఫ్ట్ ( Gifts In Marriage )లు ఇచ్చే సాంప్రదాయం బాగా పెరిగింది.
పెళ్లికి హాజరయ్యేవారు తమకు ఇష్టమైన గిఫ్ట్‌ను కొత్త జంటకు అందిస్తారు.అయితే ఇటీవల కొంతమంది వినూత్నమైన బహుమతులను అందిస్తూ అందరినీ నవ్విస్తున్నారు.
అందులో భాగంగా తాజాగా ఒక వధువుకు ఇచ్చిన గిఫ్ట్( A Gift To The Bride ) గురించి తెగ చర్చ జరుగుతోంది.
బాత్రూం కడిగే బ్రష్, చపాతీల కర్ర, చీపురు, బకెట్,.మార్పర్ వంటి వంటిని వధువుకు బహుమతిగా అందించారు.
"""/" /
వధువుకు ఈ బహుమతులు ఇస్తుండగా కొంతమంది పెళ్లికి హాజరైనవారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.అయితే ఈ వినూత్న ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం బయటకు రాలేదు.
కానీ దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుున్నాయి.
వీటిని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
వధువు తరపు స్నేహితులు ఈ బహుమతులు అందించినట్లు తెలుస్తోంది.ఈ పెళ్లికి వధువు స్నేహితులు చాలామంది హాజరయ్యారు.
వారందరూ ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చారు.ఇది చూసి వరుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు.
పెళ్లికి వచ్చినవారందరూ కూడా దీనిని చూసి నవ్వుకున్నారు.ఇవేం గిఫ్ట్ లు అంటూ నవ్వుకున్నారు.