హైకోర్టులో ప్రభుత్వంపై గెలిచిన సాధారణ మహిళ

నల్గొండ జిల్లా:తిపర్తి మండలం కేశరజుపల్లి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 31లో గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైండ్ మెంట్ భూమిని ప్రభుత్వం వారు ఐటి ఇండస్ట్రీల్ పార్క్ కోసం చట్ట వ్యతిరేకంగా కేటాయించారంటూ గ్రామానికి చెందిన బాధితురాలు గునగంటి మారమ్మ అనే మహిళ హైకోర్ట్ ను అశ్రయించడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలంటూ ఫిర్యాదురాలు తరుపున హైకోర్టు న్యాయవాది జి, కరుణాకర్ రెడ్డి.

WP.31646/2022 రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం నేతృత్వంలో రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టి ల్యాండ్ అక్రివేషన్ మరియు ప్రొసీడింగ్స్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నందున ధర్మాసనం అట్టి ల్యాండ్ అక్రివేషన్ పోసిడింగ్స్ ను సస్పండ్ చేయడం జరిగిందని ఆదివారం పిటీషనర్ తరుపు న్యాయవాది కరుణాకర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల అసైడ్ భూములను టార్గెట్ చేస్తూ పేదల భూములను బలవంతంగా,చట్టాలను ఉల్లంఘించి పేదలను టార్గెట్ చేస్తూ భూములను తీసుకుంటుంది.

గత ప్రభుత్వాలు పేదలకు బతకడానికి భూములు ఇస్తే,ఈ ప్రభుత్వం ఉన్న భూములను పేదల దగ్గర నుంచి భారత రాజ్యాంగం,ల్యాండ్ అక్రివేషన్ చట్టాలను మరియు అసైడ్ మెంట్ చట్టాలను ఉల్లంఘించి పేదల భూములను లాగేసుకుంటుందని ధర్మాసనం ముందు వాదించడం జరిగిందన్నారు.

ధర్మాసనం ఇరువురి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ జరిగేంత వరకు ఆల్ ల్యాండ్ అక్రివేషన్ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేస్తూ సంబంధిత రాష్టస్థాయి,జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు.

ఇది పేద భూ బాధితుల విజయంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.

జగన్ పతనాన్ని ముందే ఊహించాను… అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు!