శ్మశానంలో చోటు చేసుకున్న విషాదం.. కాలుతున్న చితిలో పడి పాపం.. !
TeluguStop.com
మరణం ప్రతి జీవికి సహజంకానీ కొందరికి వచ్చే మరణం మాత్రం బాధాకరంగా ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది.కాలుతున్న చితిలో పడి ఓ వృద్ధురాలి మరణించింది.
ఇలా శ్మశానంలో చోటు చేసున్న విషాద ఘటన గురించి తెలుసుకుంటే.ఇచ్చాపురం పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన జమున మహంతి (72) అనే వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందగా ఆమెకు కండ్రవీధి శ్మశానవాటికలో గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్పా గౌడవీధికి చెందిన రెయ్యి చంద్రమ్మ (66) మహిళ, అందరు అక్కడి నుండి వెళ్లిన తర్వాత మండుతున్న చితిలో దూకేసింది.
అయితే ఈ విషయాన్ని ఒక పశువుల కాపరి గుర్తించాడు.అప్పటికి ఆ మహిళను కాపాడటానికి చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో ఆ చితిలోనే కాలిపోయిందట.
కాగా ఇదే అదే శ్మశాన వాటిక వద్ద ఆమె మృతదేహానికి పంచనామ నిర్వహించి అత్యక్రియలు పూర్తి చేశారట బంధువులు.
ఇకపోతే చంద్రమ్మ భర్త ఈ మధ్య కాలంలో మరణించాడని, అప్పటి నుండి ఆమె మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తుందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.
కానీ మండుతున్న చితిలో పడి మరణించడం ఎంత దారుణం.
మ్యాడ్ స్క్వేర్ టీజర్ రివ్యూ.. ఫస్ట్ పార్ట్ ను మించిన కామెడీతో అదరగొట్టారా?