ప్యాంట్స్ ధరించడానికి పెద్ద స్టంటే చేసిన పెద్దాయన.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..

ఫేమస్ కావడానికి చాలా మంది డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు.కొంతమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.

ఈ ట్రెండ్ యువతలో ప్రత్యేకంగా పాపులర్ అయింది.అయితే యువకులు మాత్రమే విన్యాసాలు చేయరు.

వయసు పైబడిన వారు కూడా స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.తాజాగా వైరల్ వీడియోలో ఓ వృద్ధుడు( Old Man ) తన స్టంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ వృద్ధుడు కొంచెం ఎత్తు పైనుంచి దూకి ప్యాంట్ వేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.

అతని స్టంట్, అతని ఉత్సాహం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. """/" / వీడియోలో, వృద్ధుడు ఊయల మీద ఊగుతున్నాడు.

ఇద్దరు మహిళలు( Women ) అతని ముందు ప్యాంటు పట్టుకుని ఉన్నారు.అతను ఊయల ఊగుతూనే సడన్ గా గాలిలోకి దూకాడు.

ఆపై తన రెండు కాళ్లు ప్యాంటు రెండు బొక్కలలో పట్టేలా జంపు చేశాడు.

ఆ ప్యాంటులో అతడు బాగా ల్యాండ్ అయ్యాడు.ఇలా వెరైటీగా ప్యాంటు వేసుకోవడంలో అతడు సక్సెస్ అయ్యాడు.

తర్వాత ఈ సక్సెస్‌ను అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు.భూమిపై కూర్చొని పాకేస్తూ అతడు రచ్చ రచ్చ చేశాడు.

ఆ వయసులో కూడా ఈ పెద్దాయనలో ఉన్న ఉత్సాహం చూసి నెటిజన్లు స్టన్ అయ్యారు.

నువ్వు సూపర్ అంకుల్ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. """/" / ఈ వీడియోను కజెమ్ ఘసేమీ( Kazem Ghasemi ) అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

2023లో ప్యాంట్లు వేసుకోవడానికి ఇదో కొత్త పద్దతి అని.స్టంట్ నచ్చితే కామెంట్ చేయాలని కూడా కోరాడు.

ఇలాంటివి ట్రై చేసి, అది బెడిసి కొడితే ముఖం పగిలిపోతుందని కొందరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.

కొందరు మాత్రం 'ప్యాంటు ఇలా కూడా తొడుక్కుంటారా? ఇదేం స్టంట్ బాబోయ్' అంటూ తెగ నవ్వుకుంటున్నారు.

ఏదేమైనా ఇలాంటి రిస్కులు చేయకపోవడమే శ్రేయస్కరమని చెప్పవచ్చు.

అలా పిలిస్తే మాత్రమే బాలకృష్ణకు ఇష్టం.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!