వామ్మో: పామును మెడకు చుట్టుకొని సైకిల్ యాత్ర చేపడుతున్న వృద్ధుడు..!

సోషల్ మీడియా అనేది ఓ గమ్మత్తు ప్రపంచం.నెట్టింట్లో ఇప్పుడు అనేక వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.

అందులో కొన్ని సంతోషాన్ని కలిగించేవి అయితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి.ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా సోషల్ మీడియాలో ఇట్టే ప్రత్యక్షమైపోతూ ఉంటుంది.

రోజూ అనేకమంది వీడియోలను ‌అప్‌లోడ్ చేస్తుంటారు.తాజా అలాంటి వీడియో గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలో ఓ వృద్దుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.సహజంగా మనం చూసినట్లేతే మనుషులు ఆమడ దూరంలో ఉన్నా కూడా పామును చూస్తే చాలు వెంటనే పరిగెత్తుతారు.

అలాంటిది ఓ పాము దగ్గరగా వస్తే కూడా ఇంకేమైనా ఉందా.గుండె ఝల్లుమంటుంది.

భయంతో పరుగులు తీస్తాం.అయితే ఇక్కడ మాత్రం అలా జరగలేదు.

ఈ ముసలాయన ఏకంగా పాముతో సహజీవనం చేస్తూ బతుకుతున్నాడు.శివుడిలాగే పామును తన మెడలో వేసుకుని సైకిల్‌పై సవారీ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి జిల్లాలోని హంగరగ గ్రామంలో ఓ ముసలాయన బతుకుతున్నాడు.ఆయన ఓ పామును తన మెడలో వేసుకుని సైకిల్‌పై సవారీ చేసి ఆశ్చర్యపరిచాడు.

ఆయన పామును తన మెడలో వేసుకుని తిరగడాన్ని చూసి ఓ యువకుడు వీడియో తీశాడు.

ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఆ వీడియోలు కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి.

"""/"/ ఆ వృద్దుడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మెడ చుట్టూ పామును చుట్టుకుని సైకిల్‌పై దూసుకెళ్లిన వృద్ధుడు కొంత సమయం తర్వాత ఆ పామును తమ గ్రామ సమీపంలోని పొలాల్లో వదిలిపెట్టడం విశేషం.

సర్పం మెడలో వేసుకుని ఉన్న ఆ వృద్దుడ్ని గ్రామస్ధులు చూడ్డానికి ఎగబడ్డారు.ఆయన చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

గేమ్ షోలో ఆయనకు పోటీగా జాకెట్ విప్పి రచ్చ చేసిన అనసూయ.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్!